మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి
- జిల్లా కలెక్టర్ కి మెమెరాండమ్ అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ
విశ్వంభర, జనగామ : దేవరుప్పుల మండలం లకవత్ తండా పంచాయతీ పరిధిలోని శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేయడం పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మైనింగ్ పనుల వల్ల ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉండటమే కాకుండా, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ తెలిపారు. ముఖ్యంగా గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఉనికి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు కొండపై ఉన్న సహజ వనరులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, మైనింగ్ కార్యకలాపాల వల్ల భూగర్భ జలాలు, పంట భూములు మరియు ప్రకృతి వనరులు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు, పర్యావరణ పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ మరియు రైతుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకొని వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ను డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ కోరారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండలానికి చెందిన లకవత్ తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడా యాకన్న, మూడో వార్డు సభ్యురాలు లకవత్ వెన్నెల (భర్త: సుధాకర్), పొట్టిగుట్ట తండా గ్రామ సర్పంచ్ అనిత , ధరవతే తండా గ్రామ సర్పంచ్ అనిత, నల్లకుంట తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు భాస్కర్, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.