టి.బి. ఉచిత ఛాతీ ఎక్స్ రే క్యాంపు విజయవంతం 

విశ్వంభర, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి  ఆదేశానుసారం, జిల్లా టి.బి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పాపారావు  సూచనల మేరకు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు పరిధిలోని సబ్ సెంటర్ ఎలికట్ట గ్రామంలో శుక్రవారం ఉదయం టి.బి (క్షయవ్యాధి) ఉచిత చాతి ఎక్స్రే క్యాంపు నిర్వహించడం జరిగింది అని ఎమ్.ఎల్.హెచ్.పి. వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ చెప్పారు. ఈ సందర్బంగా  టి.బి. క్యాంపు హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ ,  టి.బి. అంటే క్షయవ్యాధి అని , ఇది ఒక అంటువ్యాధి అని, ఈ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సాధారణంగా ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది అని, కానీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించవచ్చు అని చెప్పారు. టి.బి. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే, టి.బి. ఉన్న వ్యక్తి , దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు గాలిలోకి వచ్చే సూక్ష్మ క్రిముల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది అని జె.శ్రీనివాసులు చెప్పారు. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం రాత్రిపూట రావడం , చెమటలు పట్టటం,బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, అలసటరావడం, కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు చెప్పారు.టి బి వ్యాధి గ్రస్తులు దగ్గేటప్పుడు,తుమ్మెటప్పుడు,నోటి కి దస్తిగుడ్డ కాని, లేదా రుమాల కాని, అడ్డు పెట్టు కొని దగ్గ లని జె.శ్రీనివాసులు చెప్పారు.  టి.బి వ్యాధి గ్రస్తులు పరిశుభ్రత పాటించాలి అని, మంచి పోషకాహారం తీసుకోవాలి అని, గదుల్లో గాలి, వెలుతురు ఉండాలి అని, ప్రజలు టి.బి. రోగులకు సమీపంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. టి.బి. కి  సరి అయిన చికిత్స తీసుకుంటే,టి.బి. పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని,ఈ వ్యాధి కి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స మరియు మందులు అందిస్తారు అని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ చెప్పిన విధంగా 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలం టి.బి మందులు క్రమంగా తప్పక వాడాలి అని జె. శ్రీనివాసులు చెప్పారు.చివరగా ముఖ్య సందేశం టి.బి.కి భయపడొద్దు సరైన చికిత్సతో పూర్తిగా నయం చేసుకోవచ్చు.  టి. బి. క్యాంపు కు వచ్చిన వారందరికీ హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో మొత్తం 41 మంది ఎక్స్రే పరీక్షలు చేయించుకున్నారు అని జె.శ్రీనివాసులు చెప్పారు. గ్రామ సర్పంచ్  శ్రీమతి  నవకిరణనీ గారు మాట్లాడుతూ మన గ్రామంలో ఎవరికైనా దగ్గు,జలుబు,  జ్వరము,  చాతి నొప్పి ఉన్న వారందరూ కూడా శుక్రవారం  ఉచిత ఎక్స్రే క్యాంపులో పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు. వైద్యులు మన గ్రామం కొచ్చి పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషకరము అని, అందువలన ఇట్టి సదవకాశాన్ని మన గ్రామస్తులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్. హెచ్.పి పాటు వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, జిల్లా నుండి వచ్చిన రేడియో గ్రాఫర్ జహిందర్, టి.బి సూపర్వైజర్ రవికుమార్, ఎలికట్ట గ్రామ సర్పంచ్ శ్రీమతి నవకిరణ్ణి,విలేజ్ సెక్రటరీ తేజస్విని, ఏ.ఎన్.ఎమ్ లు సుమతమ్మ,సుజాత,  పుష్పలత,ఆశాలు హైమావతి,లలిత,  సుమలత,యాదమ్మ,  సక్కుబాయి, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tb-free-chest-x-ray-camp-successful/article-15829

Tags: