ఎస్ఎస్ సి జిల్లా సెకండ్ టాపర్ కు కలెక్టర్ చే సన్మానం
విశ్వంభర, మహబూబబాద్ :ఆదివారం నాడు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం యందు విద్య వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఎస్ ఎస్ సి ఫలితాలలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించడం జరిగింది. 2026 ఎస్ఎస్సి ఫలితాల యందు జడ్.పి.హెచ్.ఎస్ ఈదుల పూస పల్లి విద్యార్థిని ఎస్.కె ఆఫ్రా తబుసం జిల్లాస్థాయిలో సెకండ్ టాపర్గా నిలిచిన సందర్భంలో మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చే , మరియు శాసనమండలి సభ్యులు తక్కిల పల్లి రవీందర్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి చేతుల మీదుగా నగదు బహుమతి, మేమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ ఈదులపూసపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూజారి వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల యందు, ప్రభుత్వం కల్పిస్తున్న కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయ బృందం చే బోధన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒత్తిడి లేని విద్య, విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే లభిస్తుందని, ఇలాంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆఫ్రా సెకండ్ ర్యాంకు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆఫ్రా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవడం, జడ్.పి.హెచ్.ఎస్ ఈదుల పూస పల్లి పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ, గొర్రె శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు ఓం ప్రకాష్, ప్రభాకర్, చాంప్లా నాయక్ టి శ్రీనివాసరావు, నాగరాజు, ఇద్దయ్య, సిహెచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.