వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలి
- ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేసిన హుస్నాబాద్ బీజేపీ నాయకులు
విశ్వంభర, హుస్నాబాద్ : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని హుస్నాబాద్ లో స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా బీజేపీ హుస్నాబాద్ మండల అధ్యక్షులు భూక్య సంపత్ నాయక్ మాట్లాడుతూ, వడ్ల కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని తరుగు, తేమ లేకుండా కొనుగోలు చేయాలని రైతులకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు . కొన్ని గ్రామాలలో లారీలు అందుబాటులో లేకపోవడం వలన రైతులు తమసొంత ట్రాక్టర్ల పై వడ్లను తీసుకెళ్తున్న రైతులకు ఇబ్బంది అవుతుంది కావున ఎక్కువ మొత్తంలో లారీలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఏ ఇబ్బంది కలిగినా బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కుంట మల్లయ్య, బైరి అరుణ్, నెల్లి శ్రీనివాస్, మెరుగు రవి, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.