వాటర్‌వర్క్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : వాటర్‌వర్క్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి బండి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచి నేరుగా వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్మికులకు రేన్‌కోట్లు, క్యాప్స్, సివరేజ్ కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించాలని, మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు. తోట కార్మికులకు జీఓ 60, పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు సంతోష్, రాజరత్నం, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జగన్, వాసు, ఆంజనేయులు, వీరస్వామి, కుమార్, బాలరాజు, సురేష్, నాగరాజు, రమేష్, రమా, సమ్మయ్య, ఇంద్రసేనారెడ్డి, జంగయ్య, ఈశ్వర్, బాలాజీ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-problems-of-waterworks-workers-should-be-resolved/article-15738

Tags: