నిధులు ఉన్నా రోగులకు తప్పని తిప్పలు 

నిధులు ఉన్నా రోగులకు తప్పని తిప్పలు 

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఏరియా ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనే అధిక ఆదాయం వచ్చే ఆస్పత్రుల్లో ఒకటిగా పేరున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వార్డుల్లో ఫ్యాన్లు పని చేయక పోవడంతో రోగులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. పురుషుల వార్డులో ఫ్యాన్లు తిరగక పోవడంతో పాటు స్విచ్‌ బోర్డులు దెబ్బతిని, ప్రమాదకరంగా మారాయని రోగులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ఫ్యాన్లు పని చేయడం లేదని, ఎండ దెబ్బతో చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎండ వేడికి తట్టుకోలేక రోగులు తామే సొంతంగా చిన్న ఫ్యానులను తెచ్చుకుని వాడుకుంటున్నారు. ప్రసూతి వార్డులో పరిస్థితి ఇంకా దారుణం. బాలింత తల్లులు, అప్పుడే పుట్టిన నవజాత శిశువులు ఈ ఎండ వేడికి తట్టుకోలేక తామే సొంతంగా చిన్న ఫ్యానులను తెచ్చుకుని వాడుకుంటున్నప్పటికీ, ఆ ఫ్యాన్ల వేడికి  తట్టుకోలేకపోతున్నారు. వార్డులోని ఫ్యాన్లు సరిగ్గా పని చేయక, కూలర్లు లాంటివి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడుగుదామని వెళ్ళిన పత్రికా ప్రతినిథులకు ఆసుపత్రి పని వేళలు ఉదయం 9:00 నుండి మద్యాహ్నం 2:00 వరకు ఉండగా ఉదయం 11 గంటలు దాటాక వచ్చిందని, మళ్ళీ మద్యాహ్నం 2:00 లోపు అడుగుదామని వెళ్ళే సరికి, తాను లేదని, అప్పటికే వెళ్ళిపోయిందని, సమయ పాలన పాటించడం లేదని తేలింది. ఆసుపత్రి సూపరింటెండెంటే సమయ పాలన పాటించనప్పుడు మిగతా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఏమి సమయ పాలన పాటిస్తారు? అలాగే ఆస్పత్రికి సంబంధించిన స్థలంలోని మడిగల కిరాయిల రూపంలో ఇటీవల కాలంలో ఏప్రిల్ 16 వరకు రూ.40 లక్షలకు పైగా ఆదాయం వచ్చినప్పటికీ కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వచ్చిన నిధులను ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎండాకాలం ముగిసే వరకు వార్డుల్లో చల్లదనం కోసం కూలర్లు ఏర్పాటు చేసి, దెబ్బతిన్న స్విచ్‌బోర్డులు మరమ్మతు చేసి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూలర్లు కొన్నారని, అవి ఎక్కడకు పోయినాయని, ఈ సంవత్సరము కూలర్లు ఎందుకు కొనలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/even-if-there-is-funding-patients-will-be-misled/article-15823

Tags: