నాయిని రాజేందర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి
- హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
విశ్వంభర, హనుమకొండ : పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలని హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై అవాక్కులు, నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. నిజంగా పురాతన విగ్రహాలు బయటపడితే దేవాదాయ, పురావస్తు శాఖ అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తుంటే, కొందరు రెడీమేడ్ విగ్రహాలను తీసుకొచ్చి రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, కేటీఆర్ సర్వేల్లో గ్రాఫ్ పడిపోవడంతో కొత్త డ్రామాలకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు.శాయంపేట హనుమాన్ ఆలయానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సొంత ఖర్చులతో నిధులు అందించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే నాయిని ఉన్న భక్తి, నిబద్ధత ఎంత ఉందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. మొత్తం ఆలయ వ్యవహారంలో నిజమైన హనుమాన్ భక్తుడు ఒక్కరే ఉన్నారని, మిగతా హడావుడి అంతా బీఆర్ఎస్ నేతల రాజకీయ ప్రదర్శన మాత్రమేనని విమర్శించారు. రాజస్థాన్‌లో విగ్రహాలు తయారు చేయించి, వాటికి సంబంధించి సొంత పార్టీ నేతలే డబ్బులు పంపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. యువతకు చెత్త రాజకీయ సందేశాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. ఇక కార్యక్రమంలో మాజీ ఫోర్ లీటర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు, జక్కుల రవీందర్ యాదవ్ మామిండ్ల సురేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.