ఉపాధి హామీ పథకం పనులపై సమీక్షా  సమావేశం 

ఉపాధి హామీ పథకం పనులపై సమీక్షా  సమావేశం 

  • నిర్వహించిన మండల అధికారులు 

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఆర్‌డీఓ నాగిరెడ్డి,  మండల పరిషత్ అభివృద్ధి అధికారి  జలంధర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో కార్మికుల మొబిలైజేషన్, సోక్‌పిట్స్ నిర్మాణం, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పనుల స్థితిగతులను పరిశీలిస్తామని, విధుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ( సిబిఎస్) వెరిఫికేషన్‌ను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పెన్షన్లు పొందుతూ మరణించిన లబ్ధిదారుల వివరాలను వెంటనే గుర్తించి, వారి పెన్షన్లను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం వివిధ వర్గాలకు సంబంధించిన కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అందువల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వర్గాల వారీగా జాబితాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అదేవిధంగా( ఎన్‌ఎఫ్‌బీ ఎస్ ) పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సమావేశంలో వివరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం ప్రయోజనాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారివై. ప్రేమలత , ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్  రమ్యశ్రీ , ఏపీఓ పరశురాములు , ఈసీ విక్రమ్ , జూనియర్ అసిస్టెంట్ ఎం.డి. సమీయుద్దీన్ , ఏఈ హౌసింగ్ కిరణ్ , శ్రీ అశోక్ , హౌసింగ్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/review-meeting-on-the-work-of-employment-guarantee-scheme/article-15749

Tags: