ఉద్యమకారుల లక్ష్య సాధనలో ప్రభుత్వం స్పందించాలి 

  • : తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రకుల్ రామ్ రెడ్డి

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు, కళాకారులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ రకుల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశ సాధన సమితి  కోరే సారాం, బుల్లెట్ ఎంకన్న, వెలుగు వనితక్క ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదు గన్ పార్క్ వద్ద నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి 250 గజాల స్థలం, నెలకు 25 వేల పెన్షన్, ఆరోగ్య కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యమకారులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ, ప్రతి ఒక్కరిని అధికారికంగా గుర్తించాలని కోరారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పాటు నాలుగు జిల్లాల్లో నిర్వహించిన యాత్ర గన్ పార్క్ వద్ద ముగిసిందని, ఈ యాత్ర ద్వారా ఉద్యమకారుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. అమరవీరుల స్థూపాల వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉద్యమ స్పూర్తిని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోరే సారాం, బుల్లెట్ ఎంకన్న, వెలుగు వనితక్క, ఇతర ఉద్యమకారులు, కళాకారులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-government-should-respond-in-achieving-the-goals-of-the/article-15775

Tags: