బీఎస్పీకి వచ్చే ఎన్నికల్లో యువత అండ  

బీఎస్పీకి వచ్చే ఎన్నికల్లో యువత అండ  

  • బిఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి : పచ్చిమట్ల రవీందర్ గౌడ్

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాలం గడుపుతున్న ప్రభుత్వాలకు యువత తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ , గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులు, ఆర్టీఐ కార్యకర్తలు, జర్నలిస్టులు, లాయర్లపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దుల్కే “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ప్రారంభించడం జరిగిందన్నారు. తక్కువ సమయంలోనే ఆ పార్టీకి కోట్ల సంఖ్యలో యువత మద్దతు తెలపడం దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, వైద్య సేవల సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, పరీక్షల లీకేజీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వంటి పలు అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే యువత కొత్త ఆలోచనల వైపు మొగ్గుచూపుతోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రధాన మీడియా, ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలు కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదనే భావన యువతలో పెరుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యువత పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఆసక్తి చూపుతోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం , ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను విస్మరించారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువత మద్దతుతో బీఎస్పీ పార్టీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, సుధాకర్, శరత్ పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/in-the-upcoming-elections-for-bsp-the-youth-is-ready/article-15815

Tags: