ఫోటోగ్రాఫర్ కరుణాకర్ కుటుంబానికి అండగా సమ్మి గౌడ్ ఫౌండేషన్..
- 100 కిలోల బియ్యాన్ని తక్షణ సాయంగా అందజేత
విశ్వంభర, అమీనాపురం: కేసముద్రం మున్సిపాలిటీలోని అమీనాపురం ఎస్సీ కాలనీకి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇనుముల కర్ణాకర్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కొద్ది రోజుల క్రితం బ్రెయిన్‌లో నరాలు చిట్లి రక్తస్రావం కావడంతో ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య సుజాత, కుమారుడు షాన్, కుమార్తె రక్షిత ఉన్నారు. ఈ విషాద వార్త ను స్థానిక మిత్రులు వెంకట్ కన్నా, దండు శ్రీను ,కేసముద్రం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మిత్రులు సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య కి విషయం తెలియజేయగా వెంటనే స్పందించిన మృతుడి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్‌గా ఎన్నో సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లోని మధుర జ్ఞాపకాలను తన కెమెరాలో బంధించిన కర్ణాకర్ మరణం ఎంతో బాధాకరమన్నారు. మంచి మనసున్న వ్యక్తిని కోల్పోవడం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. సమ్మిగౌడ్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ ఫౌండేషన్ తరఫున తక్షణ సహాయం కింద ఒక క్వింటాల్ బియ్యాన్ని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో దండు శ్రీను, కళ్లెం శ్రీను, జన్ను కట్టయ్య, చంటి, శరత్, భాస్కర్, కరుణాకర్, శ్యామ్, అనిల్, కృష్ణ, రాజేందర్ కుమార్, అభిలాష్, సుశీల, యాకమ్మ, స్వర్ణలత, రమ, సరిత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.