అధిక దిగుబడుల కోసం వర్మీ కంపోస్ట్ ఎరువులనే వాడాలి
- డిపిఓ సురేష్ మోహన్
విశ్వంభర, శంషాబాద్: రైతులు పంటల అధిక దిగుబడుల కోసం వర్మీ కంపోస్ట్ ఎరువులను వాడాలని డిపిఓ సురేష్ మోహన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగూడ గ్రామంలో శుక్రవారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామపంచాయతీ లో తయారుచేసిన వర్మి కంపోస్టు స్టాళ్లను డిపిఓ సురేష్ మోహన్, సీఈఓ కృష్ణారెడ్డి, డీఎల్ పి ఓ సతీష్ రెడ్డి, ఎంపీ ఓ రమేష్ స్టాళ్లను ప్రారంభించి వాటి ఉపయోగాలను రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ సురేష్ మోహన్ మాట్లాడుతూ రైతులు వర్మి కంపోస్ట్ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవ్వ గూడ పంచాయతీ కార్యదర్శి వజ్రలింగం గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.