భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాడాలి 

భగత్ సింగ్ స్ఫూర్తితో యువత పోరాడాలి 

విశ్వంభర, విద్యానగర్ : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా మార్చి 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న సభల పోస్టర్‌ను శనివారం హైదరాబాదులోని విద్యానగర్ మార్క్స్ భవన్‌లో పీడీఎస్‌యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ , భగత్ సింగ్ స్ఫూర్తితో అన్యాయ విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ రాకేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దీక్షిత, కృష్ణ, సాయి ప్రసాద్, పవన్, అంజి, వినోద్, కిరణ్, రాజు, రాంబాబు, సాయి, నరేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: