పంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించాలి
విశ్వంభర, అనంతగిరి: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పంచాయతీ నిధుల ద్వారా చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్కిలను రద్దు చేయాలని అనంతగిరి మండల గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు మట్టపల్లి వీరబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు, పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కార్మికుల వేతనాలు చెల్లింపు ప్రక్రియలపై జరుగుతున్న కాలయాపనకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు అన్నారు. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వలే గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా ప్రభుత్వం కార్మికుల అకౌంట్లో వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పంచాయతీ కార్మికుల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మొదటి పి ఆర్ సి లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అయిన హోంగార్డు, మున్సిపల్, అంగన్వాడి, ఆశ వర్కర్లకు ,డైలీ వేజ్, వర్క్ చార్జడ్ ఉద్యోగులందరినీ గుర్తించిన విధంగా పంచాయతీ కార్మికులను రెండో పి ఆర్ సి లో గుర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పంచాయతీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల వారికి పి ఆర్ సి ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పంచాయతీ ద్వారానే కార్మికులకు వేతనాలు చెల్లించమని మార్చి రెండో తేదీన జారీ చేసిన సర్కులర్ ను రద్దు చేయాలని ,వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.



