ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
On
విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలంలోని జడ్పీహెచ్ఎస్ మోడల్ స్కూల్, కంప సాగర్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి. మోడల్ స్కూల్ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు గాను 200 మంది హాజరైనారు అదేవిధంగా ఉన్నత పాఠశాలలో 149 మంది విద్యార్థులకు గాను 149 మంది మొత్తము 349 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు, శనివారం రోజున 10వ తరగతి పరీక్షలను స్థానిక తహసిల్దార్ గాజుల ప్రమీల మండలంలోని రెండు సెంటర్లను సందర్శించి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యము లేకుండా జరగాలని తెలిపారు వారితోపాటు మండల విద్యాధికారి రమావత్ రవి తదితరులు ఉన్నారు.



