సైబర్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి 

సైబర్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి 

  •  జిల్లా ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ  అన్నారు. నకిలీ వాట్సాప్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, కే వై సి అప్‌డేట్ పేరుతో ఓ టి పి  అడగడం వంటివి మోసపూరిత చర్యలలో నేరగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి, తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్యాస్ కొరత ఉందని, వెంటనే బుక్ చేసుకోండి" అని వచ్చే సందేశాలు లేదా వాట్సాప్ లింక్‌లను నమ్మవద్దని, ఇవి వ్యక్తిగత వివరాలను, డబ్బును దొంగిలించడానికి పన్నే పన్నాగంగా గ్రహించాలన్నారు.  అదేవిదంగా గ్యాస్ సిలిండర్ డెలివరీకి ముందు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ పేమెంట్ చేయమని కోరితే అది మోసమని గ్రహించాలని అన్నారు. గ్యాస్ సిలిండర్‌ను అధికారిక మొబైల్ యాప్‌లు, ఏజెన్సీ వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలన్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ మోసపోతే, వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

Tags: