ఉచిత వైద్య శిబిరం 

ఉచిత వైద్య శిబిరం 

విశ్వంభర, హైదరాబాద్ : శాలివాహన నగర్ యూపిహెచ్ సి  ఆధ్వర్యంలో ముసరాంబాగ్ లో ని సైదాబాద్ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు  మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. వైద్య శిబిరానికి హాస్టల్ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. శిబిరంలో వైద్యులు ప్రజలకు  పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి సరైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

Tags: