అంగన్వాడి ఏఎల్ఎంఎస్సి కమిటీ

అంగన్వాడి ఏఎల్ఎంఎస్సి కమిటీ

విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని పెద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలోని భూక్యతండ అంగన్వాడి సెంటర్ లో ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీని శనివారం సర్పంచి బానోతు రేణుక నరేష్ అధ్యక్షతన ఎంపిక చేశారు. కమిటీ చైర్మన్ గా సర్పంచ్ రేణుక నరేష్, కన్వీనర్ అంగన్వాడీ టీచర్ అనిత, సభ్యులుగా హెచ్ఎం వద్ది సాయికుమార్, వార్డు సభ్యులు బానోతులక్ష్మి,నరహరి, గర్భిణి జరుపల శిరీష, బాలింత భూక్య జ్యోతి, ప్రీ స్కూల్ తల్లి భూక్యహారిక,బానోతు మౌనిక ఆశా వర్కర్ శోభ బానోతు జ్యోతి,భూక్య వెన్నెల ను నియమించారు. అనంతరం సర్పంచి రేణుక నరేష్ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని సకాలంలో లబ్ధిదారులకు అందించాలని సూచించారు. రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్ భూక్యా నరహరి అంగన్వాడీ హెల్పేర్,మౌనిక, గర్భిణీ స్త్రీలు,బాలింతలు,తల్లులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

Tags: