యుపిఎస్సి టాపర్లతో సెమినార్

యుపిఎస్సి టాపర్లతో సెమినార్

విశ్వంభర, అశోక్ నగర్: యుపిఎస్సి పరీక్షలో విజయం సాధించాలంటే స్థిరత్వం, క్రమశిక్షణ, సరైన వ్యూహం అత్యంత కీలకం అని యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ 259 సాధించిన ఎస్. వర్షిత్ రెడ్డి, ర్యాంక్ 682 సాధించిన విజయసింహ రెడ్డి అన్నారు. విజన్ ఐఏఎస్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులో స్ఫూర్తిదాయక సెమినార్ నిర్వహించారు. యుపిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో తమ అనుభవాలు, అధ్యయన వ్యూహాలను పంచుకున్నారు. హైదరాబాదుకు చెందిన ఎస్. వర్షిత్ రెడ్డి బిట్స్ పిలాని హైదరాబాదు క్యాంపస్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, తరువాత సాంకేతిక సంస్థల్లో రెండు సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలోని డిజిజిఐలో ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. విజయసింహ రెడ్డి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి రాష్ట్ర సేవల పరీక్షలో ఉత్తీర్ణులై ప్రస్తుతం హైదరాబాదులో శిక్షణ పొందుతున్నారు. సెమినార్‌కు విజన్ ఐఏఎస్ సౌత్ రీజియన్ బ్రాంచ్ హెడ్ హరేకృష్ణ సింగ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: