రేవంత్ గ్యారేజ్.. ఇచట ప్రకృతిని కూడా రిపేర్ చేయబడును. - పందేళ్ల సురక్షిత నగరానికి సీఎం శ్రీకారం -కృష్టహరి సీనియర్ జర్నలిస్ట్

రేవంత్ గ్యారేజ్.. ఇచట ప్రకృతిని కూడా రిపేర్ చేయబడును. - పందేళ్ల సురక్షిత నగరానికి సీఎం శ్రీకారం -కృష్టహరి సీనియర్ జర్నలిస్ట్

  • పందేళ్ల స్వచ్చమైన ప్రకృతి కోసం సీఎం రేవంత్ రెడ్డి వినూత్న కార్యాచరణ
  • * భూగర్బ సంపద, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అడుగులు
  • * హైడ్రా ద్వారా చెరువుల పునరుద్దరణకు ప్రశంసల వెల్లువల
  • * పునర్వైభవం సంతరిచుకున్న నగర చెరువులు
  • * మూసీ నది పునరుజ్జీవం కోసం సాహసోపేత ప్రణాళిక
  • * ప్రకృతిని కాపాడుకుంటే కాలుష్యం నుండి విముక్తి
  • * మూసీ నది పునరుజ్జీవంపై సమగ్ర నివేదిక
  • * నది పరీవాహక నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం
  • * పర్యావరణం, పచ్చదనంతో తెలంగాణ  పందేళ్ల మనుగడ
  • * భావితరాలకు సీఎం రేవంత్ రెడ్డి బంగారు కానుక
  • * నగర  భవిత కోసం సీఎం రేవంత్ రెడ్డి సాహపోపేత నిర్ణయం

విశ్వంభర: పర్యావరణ సమతుల్యత దెబ్బతిని కాలూష్యం విషం చిమ్ముతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రజల మనుగడ ప్రశ్నార్దకంగా మారుతుంది.  అభివృద్ది  ఎంత వేగవంతంగా జరుగుతున్నా నగర జీవన ప్రమాణాలు శాపగ్రస్తంగా మారాయి. వేగంగా జరుగుతున్న అభివృద్దిని చూసీ సంతోషించాలో, క్షీణిస్తున్న పర్యావరణ ప్రమాణాలను చూసి బాధపడాలో అర్ధం కాని సంకటస్థితిలో ఉంది నగర ప్రజానికం. విశ్వనగరాలుగా దూసుకెళ్తున్న అనేక పట్టణాల్లో భూగర్బ జల సంపద,  పర్యావరణ సమతుల్యత లేక, అనేక సమస్యల్లో చిక్కుకుంటేన్నారు నగర పౌరులు. తలసరి ఆదాయం ఎంతఉన్నా అందులో సగభాగం వరకూ వివిధ వ్యాధులకు ఖర్చవ్వడం పట్ల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీళ్లతో పాటు గాలిని కూడా మాల్స్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఢిల్లీ, ముంబాయి, కోల్ కత, భోపాల్, బెంగుళూరు వంటి మహానగరాల మనుగడ పర్యావరణ సంక్లిష్టతతో ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డి నగర  భవిత కోసం సాహపోపేత నిర్ణయం తీసుకున్నారు.WhatsApp Image 2026-03-14 at 5.49.15 PM (1)

*ఏ సీఎం తీసుకోని వినూత్న కార్యక్రమం*

Read More అంకుసాపూర్‌లో సంక్రాంతి సంబరాలు- మహిళల ముగ్గుల పోటీలు 

ఉమ్మడి రాష్ట్రాల ముఖ్మమంత్రులతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూడా తీసుకోని వినూత్న కార్యక్రమాన్ని తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ కోసం అమలు చేస్తున్న విధానాల వల్ల వంద సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్ తరాలకు స్వఛ్చమైన పర్యావరాణాన్ని అందించడమే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నగరంలో ఇప్పటికే అడుగంటిన భూగర్బ జలాలను కాపాడే క్రమంలో హైడ్రా  ద్వారా నగరంలోని చెరువులను, కుంటలను పరిరక్షించి సహజసిద్దంగా ఏర్పడిన జల వనరులను కాపాడే కార్యాచరణ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొదట్లో అనేక విమర్శలు ఎదురైనా నగరంలోని బతుకమ్మ కుంట,  బుమృక్-దౌలా, నల్ల చెరువు అభివృద్దిని చూసిన తర్వాత నగర ప్రజల నుండి ఊహించని ప్రశంసలు అందాయి. పునరుద్దరించిన చెరువుల చూట్టూ పచ్చని వాతావరణం, గలగలమని ప్రవహిస్తున్న నీళ్లు, చెరువుల చుట్టు పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం అంతా ఆహ్లాదంగా మారింది.  


*నగర చెరువుల పునరుద్దరణ ఓ చారిత్రక నిర్ణయం*

సుందరీకరించిన చెరువుల చుట్టూ చిన్న పిల్లల కేరింతలు, యువత క్రీడలతో, మహిళలు, పెద్దల వాకింగ్ లతో  మనో వికాసం నిండిన ఉత్పాహభరిత వాతావరణం కనిపిస్తోంది. నగర వాసులు చక్కని పచ్చని  ప్రకృతిలో ఓలలాడుతున్న అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నగరానికి ఇంతకన్నా ఉపశమనం ఏముంటుందనే చర్చ కూడా జరుగుతోంది. అంతే కాకుండా మూసీ నది  పునరుజ్జీవనాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వ్యర్ధాలతో మురికి కూపంగా మారిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తే భువనగిరి నుండి నల్లగొండ జిల్లా వజీరాబాద్ వరకు దాదాపు 110 కిలో మీటర్ల మేరకు పచ్చని ఆహ్లాదకర వాతావరణంతో పాటు పర్యావరణ పరిరక్షణ, భూగర్బజల సంపదను కాపాడుకోగలమనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం అనే బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న పేదల గృహాలను తొలగించడం దారుణమని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు.


*భావితరాలకు బంగారు కానుక  మూసీ పునరుజ్జీవం*

మూసీ పరీవాహక ప్రాంతం వెలుపల ప్రభుత్వ భూముల్లో బాదితులకు ఇళ్ల సముదాయాలను నిర్మించి ఇచ్చేందుకు సుఖుత వ్యక్తం చేసారు. దీంతో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎక్కడికో వెళ్లి కొత్త ప్రాంతంలో జీవించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసారు. ఇంటి యజమాని వృత్తికి గానీ, చిన్నారుల చదువులకు గానీ ఎలాంటి అంతరాయం ఉండదని సీఎం ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మూసీ నది పురుజ్జీవానికి కార్యచరణ తీసుకుని భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని. కలుషితం లేని జల సంపదను అందించేందుకు బృహత్కర ప్రణాళిక రచించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం గురించి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అనేక వినూత్న అంశాలని ప్రజలకు వివరించారు. రాజకీయ నాయకులు, మేధావులు, కళాకారులు, పారిశ్రామిక వేత్తలు, న్యాయకోవిదులు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని సహృదయంతో అర్దం చేసుకుని యువత బంగారు భవితకు, చక్కని పర్యావరణానికి సహకరించాలని సీఎం విజ్ణప్తి చేసారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ కార్యరూపం దాల్చితే పందేళ్ల సురక్షిత నగరానికి ఢోకా ఉండదని స్పష్టమవుతోంది.


కృష్టహరి
సీనియర్ జర్నలిస్ట్

Tags: