మహిళల సాధికారతకు సయోధ్య కృషి

మహిళల సాధికారతకు సయోధ్య కృషి

విశ్వంభర, గోల్నాక : బస్తీల్లోని మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని సయోధ్య సంస్థ వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపడుతోందని  మాజీ కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, అమృత, డి.పి. పద్మ, దుర్గాప్రసాద్ రెడ్డి అన్నారు. గోల్నాక డివిజన్ తులసిరాం నగర్ లంకలో శనివారం సయోధ్య మహిళా మేళా  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆరోగ్య శిబిరం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు గైనిక్ వైద్య సేవలు, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంటి నుంచే ఉపాధి పొందేందుకు టైలరింగ్, జూట్ బ్యాగులు తయారీ, వంట శిక్షణ, ద్విచక్ర వాహనం నడపడం వంటి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆధార్, పాన్ కార్డు మార్పులు, ఆరోగ్యశ్రీ, ఈ-శ్రమ, లేబర్ కార్డులు, పుట్టిన సర్టిఫికెట్లు, వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులపై కూడా సహాయం అందించనున్నట్లు చెప్పారు.

Tags: