కంటి చికిత్సా శిబిరం
విశ్వంభర, అనంతగిరి: మండల పరిధిలో గల వాయిలసింగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వర్గీయ గద్దె రామారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు గద్దె రఘు,గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోషల్ వర్కర్,స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ్ రాజశేఖర్ లయన్స్ క్లబ్ కోదాడ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి శాస్త్ర చికిత్స మెగా శిబిరాన్ని వినియోగించుకోవాలని సర్పంచి నందిగామ శ్రీనివాసులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఉదయం 9 గంటలకు చికిత్స ప్రారంభం అవుతుందని,వాయిలసింగవరం,రత్నవరం,చుట్టుపక్కల తండా పరిసర గ్రామం ప్రజలు ఆధార్ కార్డు వెంట తీసుకుని వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని,ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వారు తెలిపారు.లయన్స్ కంటి ఆసుపత్రి సూర్యపేట వైద్యులు పరీక్షించి కంటి పొరలు ఉన్నవారికి,కళ్ళజోడు అవసరమైన వారికి సబ్సిడీ ధర(రూ.250)కు మాత్రమే అందజేస్తారని ఈ అవకాశాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారుసూచించారు.



