ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డ్ ఇస్లాం పురం లో మాజీ కౌన్సిలర్ ఘని, కౌన్సిలర్ ఫరూక్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్షలలో భాగంగా నిర్వహించిన.ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ.. భక్తి శ్రద్దతలో నిర్వహించే పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను 24 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతిఒక్కరు ఈ పవిత్ర ఉపవాస దీక్షలను భక్తి శ్రద్దలతో పూర్తి చేసుకొని అల్లా ఆశీస్సులు పొందాలని అన్నారు. మనం ఎల్లప్పుడూ మన మిర్యాలగూడలో కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉంటూ.. ఇరు మతాలను గౌరవించుకుంటూ ఈ సమాజానికి ఆదర్శ వంతంగా ఉండాలని అన్నారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులకు అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రస్ నాయకులు గుడిపాటి నవీన్, అబ్దుల్లా, ఇంద్ర కుమార్, రవి నాయక్, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.



