ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు 

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు టి.ఎస్.వి. ప్రసాద్ ప్రసన్న అన్నారు. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్రపై మాట్లాడారు. కార్యక్రమంలో చైర్పర్సన్ కేస్ సుఫల, కార్యదర్శి తులసి పద్మజ, కోశాధికారి రోహిణి, వైస్ ప్రెసిడెంట్లు అనురాధ, వి.ఎస్. లక్ష్మి, జాయింట్ సెక్రటరీలు అరుణ, విజయలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమానికి వాణిశ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సెక్రటరీ తులసి కృష్ణమూర్తి, మోటివేషన్ స్పీకర్ లక్ష్మీ ప్రియ ప్రసంగించారు. కార్యక్రమంలో ఈసీ సభ్యులు రేణుకాదేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: