అంగన్వాడీలో బాల మేళా

అంగన్వాడీలో బాల మేళా

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని 5వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాల మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళాలో విద్యార్థులు తాము నేర్చుకున్న ఆటాపాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం కౌన్సిలర్ అన్నగోని వినోద్ గౌడ్ సతీమణి లావణ్య చిన్నారులకు స్టీల్ టిఫిన్ బాక్సులను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో డీడబ్య్లూవో శారద, సూపర్‌వైజర్ స్వప్న, అంగన్వాడీ టీచర్లు జ్యోతి, చంద్రకళ, స్వప్న, సరస్వతి, మహేశ్వరి, సంతోషి, రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: