క్రీడా పాఠశాలలకు ఎంపికలు 

క్రీడా పాఠశాలలకు ఎంపికలు 

విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ 5, కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని తెలిపారు. ఎంపిక విధానం ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, 10×6షటిల్ రన్, 800మీ, పరుగు అంశాలలో పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440478436, 9704061543 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Tags: