హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్
విశ్వంభర, మేడ్చల్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపురం గ్రామంలో దంతం రాజేష్ , తన్నేరు మణి తేజ చిన్నతనంలో పీర్జాదిగూడలో ఇరుగుపొరుగున నివసించేవారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా, 2021లో రాజేష్ స్థాపించిన 'ఫాస్ట్ అండ్ ఫ్రెష్' లాండ్రీ వ్యాపారంలో మణితేజ్ భాగస్వామిగా చేరాడు. సద్దుపల్లి వద్ద నడుస్తున్న వ్యాపారంలో గత రెండేళ్లుగా వ్యాపారం నష్టాల్లోకి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో రాజేష్ మణి తేజతో మాట్లాడటం మానేశాడు . దీంతో రాజేష్ నిందితుడితో మాట్లాడటం మానేసి, వ్యాపార పనుల కోసం శ్రీనివాస్ అనే వ్యక్తిని సూపర్వైజర్‌గా నియమించుకున్నాడు. దానితో మణి తేజ , ఈశ్వర్ అనే వ్యక్తులు రాజేష్ ఇంటికి శనివారం రాత్రి వెళ్లారు. బాధితుడు రాజేష్ కుక్కలకు మిగిలిపోయిన ఆహారం వేసేందుకు ఇంటి నుండి బయటకు వచ్చాడు. అప్పటికే పొదల్లో దాక్కున్న మణితేజ్ ఒక్కసారిగా బయటకు వచ్చి రాజేష్‌పై పెట్రోల్ కవర్ విసిరి, అగ్గిపెట్టెతో నిప్పంటించేందుకు ప్రయత్నించాడు ప్రాణభయంతో రాజేష్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని నిందితుడి బారి నుండి అతన్ని రక్షించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సోమవారం నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించారు.



