సన్న వడ్లను సాగు చేయాలి
విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రకటించిన సన్న రకాల వరి సాగును చేపట్టి బోనస్ ను అందిపుచ్చుకోవాలని మండల కేంద్రం మేజర్ ఇనుగుర్తి గ్రామపంచాయతీ సర్పంచి తమ్మడపల్లి కుమార్,పెద్దతండ(సీఎం) సర్పంచి బానోతు రేణుక నరేష్ రైతులకు సూచించారు. మండల కేంద్రం ఇనుగుర్తి రైతు వేదికలో మంగళవారం విత్తనమేళాను వారు ఏవో మహేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి లు మాట్లాడుతూ విత్తనమేళాలో ప్రభుత్వం బోనస్ అందజేసే సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కేఎన్ఎం 1638, కేఎన్ఎం 77 15, ఆర్ ఎన్ ఆర్ 15048, హెచ్ఎంటి సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూ జి ఎల్ -44, బిపిటి 5204 వరి రకం వెరైటీ విత్తలను కొనుగోలు చేసి సాగుకు పాల్పడి బోనస్ పొందాలని సూచించారు. విత్తనమేళా ఈనెల 30 వరకు కొనసాగుతుందని తెలిపారు.కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచిలు ముదిరెడ్డి కళావతి శ్రీనివాసరెడ్డి, మీటు నాయక్,శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము,కూరెల్లి సతీష్ గంజి శ్రీనివాస్ రెడ్డి,నదునూరి ప్రశాంత్ మరియు ఏఈఓ లు శ్రీ వి భాస్కర్,చందులాల్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.