యూనివర్సిటీలో కెపిఎంజి అవగాహన ఒప్పందం
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ పోచారం సర్కిల్ వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కేపీఎంజీ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అనురాగ్ విశ్వవిద్యాలయ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ట్రస్ట్ 24 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని గుర్తుచేశారు. 2002లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రయాణం ప్రస్తుతం ప్రతి ఏడాది 16 వేల మంది విద్యార్థులకు విద్యను అందించే స్థాయికి చేరుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, నాణ్యమైన అధ్యాపక బృందం, ఉత్తమ అభ్యాస పర్యావరణం అనే మూడు అంశాలపై దృష్టి సారించడమే ఈ అభివృద్ధికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిరస్థాయిగా నిలిచే అభ్యాస ఫలితాలను సాధించే దిశగా అధ్యాపకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేపీఎంజీ నేషనల్ లీడర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ నారాయణన్ రామస్వామి యూనివర్సిటీ అధ్యాపకులు కే పి ఎం జి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.