బెస్ట్ సేవా సోసైటి ఆద్వర్యంలో మంచి మార్కులు సాదించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతిలో పాసైన, ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ బుధవారం రోజు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాజన్ బాబు పాల్గొని మాట్లాడుతూ, కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో ఉతీర్ణత శాతం పెరిగి, విద్యార్థులు మంచి నైపుణ్యం సాదిస్తున్నారని, వారికి మరింత ప్రోత్సహం కల్పిస్తే మంచి మార్కులతో జిల్లా, స్టేట్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నదని, అందుకోసం దాతలు ముందుకొచ్చి తగు సహయ సహకారాలు, విద్యకు సంబందించిన సామాగ్రి అందించి ఆదుకొంటే ఊరుకు, స్కూలుకు మంచి పేరుప్రతిష్టలు వస్తాయని తెలిపారు. బెస్ట్ సేవా సొసైటీ ఉపాధ్యక్షులు మిర్యాల రామకృష్ణ సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకంగా అభినందన సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ జి, ఆర్గనైజర్ వేముల సైదులు, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీనివాస రావు, శేఖర్ రెడ్డి, రమేష్, జ్యోతి, విద్యారాణి తదితరులు పాల్గొన్నారు.