మిషన్ భగీరథ నీటి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలి 

  • మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్

విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైప్‌లైన్ మరమ్మతు పనులు ఎప్పుడు పూర్తవుతాయో, నీటి సరఫరాఎప్పుడు పునరుద్ధరించబడుతుందో స్పష్టత లేకపోవడం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాము. సమస్యపూర్తిగాపరిష్కారమయ్యే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నాము. ఈ అంశంపై నేడు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించి, ప్రజల ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ప్రజల సంక్షేమం దృష్ట్యా అధికారులువెంటనే స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంచూపాలని బి ఆర్ ఎస్  పార్టీ కౌన్సిలర్లుడిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమములో పెద్ది శ్రీనివాస్ గౌడ్, గడ్డం దీపిక,తిరుమలగిరి వజ్రం, అంజిబాబు,వడ్డేపల్లి శ్రీనివాస్,  లావురి సుధాకర్, జన్నపాల కిరణ్, తిరంశెట్టి కోటేశ్వర రావు, పునాతి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mission-bhagiratha-water-supply-issue-should-be-resolved-immediately/article-17204

Tags: