రామన్నపేట మండలంలో విత్తన మేళా
విశ్వంభర, రామన్నపేట: ప్రభుత్వ నిర్ణయం మేరకు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక, వెల్లంకి గ్రామంలోని రైతు వేదికలలో విత్తన మేళా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం రామన్నపేట మండల వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఈ నెల 23. నుండి 30 వరకు నిర్వహించనున్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో రామన్నపేట-వలిగొండ వ్యవసాయ మర్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల సాగులో ఆధునిక విధానాలు, ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతు వేదికల ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రాయితీలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు జమీరొద్దన్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన 7 సన్న రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయి. రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబడింది. కావున రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తన మేళాలో పాల్గొని తమకు కావలసిన విత్తనాలను కొనుగోలు చేసుకోవలసిందిగా మండల వ్యవసాయ శాఖ మండలంలోని రైతులను కోరడమైనది.