బ్రాహ్మణపల్లి లో రైతులకు విత్తన మేళా 

బ్రాహ్మణపల్లి లో రైతులకు విత్తన మేళా 

విశ్వంభర,  గుండాల: గుండాల మండలంలోని గుండాల  బ్రాహ్మణపల్లి రైతువేదికలలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ విత్తన మేళాలో ప్రభుత్వం సూచించిన  సన్న రకాల వరి విత్తనాలు, కంది విత్తనాలు రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండాల మండల వ్యవసాయ అధికారి సూరజ్ మాట్లాడుతూ ప్రభుత్వం బోనస్ అందించే ఏడు వరి రకాలను బీ పీ టి- 5204,ఆర్ఎన్ఆర్- 15048, హెచ్ఎమ్ఎటి సోనా,జై శ్రీరామ్,కేఎన్ఎమ్- 1638,డబ్ల్యూజిఎల్-44,కేఎన్ఎమ్-7715 రకాలు తెలపడం జరిగిందని కావున రైతులు  ఏడు సన్న వరి రకాలను మాత్రమే సాగు చేసుకోవాలని వాటికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని తెలియజేశారు. రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తక్కువ కాలంలో  తక్కువ నీటితో సాగయ్యే  పంటలను పండించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు దేవన బోయిన ఐలయ్య ఉప సర్పంచులు వార్డు నెంబర్లు ఏఈఓ లు శ్వేత, నవనీత, ప్రసన్న, పవన్   రైతులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seed-fair-for-farmers-in-brahmanapalli/article-17090

Tags: