ప్రైవేట్ హై స్కూల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే  నాగరాజు 

విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపుర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రయాగ్ విద్యాపేట పబ్లిక్ ప్రైవేట్ హై స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  రిబ్బన్ కట్ చేసి పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించి, విద్యార్థులకు అందుబాటులో ఉంచిన విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విద్యా రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ఆధునిక సౌకర్యాలతో విద్యను అందించేందుకు ముందుకు వస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు పోటీ ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు  స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-nagaraju-started-the-private-high-school/article-16475

Tags: