ఘనంగా సంతోషిమాత బ్రహ్మోత్సవం
విశ్వంభర, సూర్యాపేట:జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రతిష్టించి 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుదవారం దేవాలయంలో బ్రహ్మెత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివ రామ కృష్ణ శర్మ, పరిమి శివరామ జగన్నాథ శర్మ, అశోక్ మిశ్రా లు శ్రీ సంతోషిమాత, శ్రీ సత్య సాంబశివుడు, శ్రీ లక్ష్మీ గణపతి, క్షేత్రపాలక ఆంజనేయస్వామి, సంతాన నాగదేవత ,మానస దేవి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు అలంకరణలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో సామూహికంగా కుంకుమార్చన పుష్పార్చన, గాజుల పూజ, పసుపు కొమ్ముల పూజలు నిర్వహించారు. అనంతరం రుద్ర, లలిత, గణపతి హెూమాన్ని నిర్వహించి మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయగౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్త అధ్యక్షులు బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ కోశాధికారి కొత్త మల్లికార్జున్ ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, సోమ శ్రీశైలం, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, నూక ముత్యాలమ్మ ,బ్రాహ్మ0డ్లపల్లి నాగమణి, మహంకాళి కవిత, బచ్చు నీరజ, ఓరుగంటి కనకరత్నం, వందనపు వెంకటేశ్వర్లు , లక్ష్మారెడ్డి,దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.