జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ తహశీల్దారు కు వినతి

 విశ్వాంభర, పెద్దశంకరంపేట : నార్సింగ్ మండలంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ పెద్ద శంకరంపేట లో  పేట జర్నలిస్టులు మంగళవారం తాసిల్దార్ నారాయణ కు వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు భద్రత కల్పించి, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో విలేకరులు రామచంద్ర చారి కరణం రవి శ్రీనివాస్ ప్రవీణ్ రవి వర్మ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-to-tehsildar-condemning-attack-on-journalist/article-17100

Tags: