పుట్ట మధుపై విమర్శలు మానుకోవాలి: బీఆర్ఎస్ నేతలు
విశ్వంభర, కమాన్‌పూర్: మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మధుపై నిరాధార విమర్శలు చేస్తే సహించబోమని కమాన్‌పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తాటికొండ శంకర్ హెచ్చరించారు. గురువారం కమాన్‌పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముత్తారం మండలంలో జరిగిన ఆత్మహత్య కేసులో బీఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ గౌడ్‌ను రాజకీయ కక్షతో ఇరికించారని ఆరోపించారు. అధికార పార్టీని ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి పుట్ట మధు కృషి చేశారని, ముఖ్యంగా రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయడం ఆయన ఘనతేనని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పుట్ట మధు విజయం ఖాయమని, ప్రజల మద్దతు ఆయనకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.