మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బిఅర్ఎస్ నాయకులు కుంచం రమేష్ కుమార్తె కుంచం మైత్రి అకాల మరణం చెందగా, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య వారి మృతదేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించడం జరిగింది. అలాగే ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బంగారుగళ్ళ బాలరాజు అకాల మరణం చెందగా, వారి మృత దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించడం జరిగింది. అలాగే రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కిష్టయ్య మరణించగా, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారి మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించడం జరిగింది.