ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం
విశ్వంభర, హైదరాబాదు : ఘనా పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం తెలంగాణ సచివాలయంలో ఘనా ప్రతినిధి బృందంతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఘనాలో ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్టస్ ఒబువాడుం టానో నేతృత్వంలోని బృందం పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహంపై తమ ప్రణాళికలను వివరించింది. తెలంగాణ తక్కువ సమయంలోనే ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫార్మా తయారీ, పరిశోధన, వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా శృంఖల నిర్వహణలో తెలంగాణకు ఉన్న నైపుణ్యాన్ని ఘనాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఘనా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు.