సంగెం గ్రామ నర్సరీలను పరిశీలించిన జిల్లా పరిషత్ సి ఈ ఓ

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ( జెడ్ పి సి ఈ ఓ )  శోభారాణి సంగెం గ్రామాన్ని సందర్శించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. మొదటగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను తనిఖీ చేసి, నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కేంద్రం (ఎస్ ఎల్ డబ్ల్యు ఎం )ను సందర్శించి, సహజ పద్ధతుల్లో సేంద్రియ ఎరువు తయారీకి సంబంధించిన మార్గదర్శకాలను సిబ్బందికి వివరించారు. వ్యర్థాల నుండి సహజసిద్ధంగా తయారయ్యే సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, సేంద్రియ ఎరువుల తయారీ మరియు వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి వరి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, నిల్వ మరియు రవాణా ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామ నర్సరీని సందర్శించి మొక్కలు, నారు మొక్కల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృత స్థాయిలో మొక్కలు నాటడం చేపట్టేందుకు ప్రజలను ప్రోత్సహించాలని సంబంధిత బృందానికి ఆదేశించారు. నర్సరీ నిర్వహణ, మొక్కల సంరక్షణ మరియు పచ్చదనం పరిరక్షణలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని, వణసేవక్, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు  బృందం చేపడుతున్న కృషిని ఆమె అభినందించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్ కె. జితెందర్ రెడ్డి , సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/zilla-parishad-ce-o-inspected-sangem-village-nurseries/article-16469

Tags: