నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్ 

నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్ 

విశ్వంభర, ముషీరాబాదు : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా హైదరాబాదు ముషీరాబాదు వాలీబాల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో కోచ్ సతీష్ మాట్లాడారు. శిబిరంలో క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ఈ శిక్షణను కొనసాగించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/sports/satish-is-a-top-class-coach-with-continuous-practice/article-16465

Tags: