మహిళా కాంగ్రెస్ నిరసన

మహిళా కాంగ్రెస్ నిరసన

విశ్వంభర, హైదరాబాద్: ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు నాయకత్వంలో గాంధీభవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. “మోడీ కాంప్రమైజ్” పేరుతో టీషర్ట్లు ధరించి ప్రధాని మోడీపై ఆందోళన వ్యక్తం చేశారు. జెఫ్రీ ఎఫ్ స్టీన్ కేసులో బయటపడిన ఈమెయిల్స్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అనంతరం హర్దీప్ సింగ్ పూరి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అస్మా, కాంస్టిట్యూయెన్సీ ప్రెసిడెంట్లు మాధవి, కమల, బ్లాక్ ప్రెసిడెంట్లు వనజ, షకీలా, డివిజన్ ప్రెసిడెంట్లు శ్రీలత, రజని, శ్రీదేవి, దుర్గ, సునీత, తహసిల్ బేగం, అయేషా బేగం, కవిత, విజయ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: