కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
విశ్వంభర, శేరిలింగంపల్లి: మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 250 మంది లబ్ధిదారులకు రెండు కోట్ల యాబై లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , నార్నె శ్రీనివాసరావు , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ, ఈ రోజు 250 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు,మహిళ సోదరీమణులు మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



