జీవో 11 అమలు చేయాలి

విశ్వంభర, హైదరాబాద్  : విద్యుత్ సంస్థలో పీస్ రేట్ పద్ధతిలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్‌కు జీవో నెంబర్ 11ను తక్షణమే అమలు చేసి 30 రోజుల పని, కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీజీఎస్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న సుమారు 1600 మంది కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు చేయాలని, సబ్‌స్టేషన్లలో ఖాళీలను అర్హతల ఆధారంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్స్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమంచిలి బాబ్లీ, వడ్ల బ్రహ్మం, చిరంజీవి, ప్రశాంత్, విజయభాస్కర్, అమృత, శ్రీనివాస్ తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Tags: