గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: వేసవి కాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుదవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా నివారణ చర్యలపై డిఆర్డిఓ, డిపిఓ, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్, మండల ప్రజా పరిషత్ అధికారులు, మునిసిపల్ కమీషనర్ లతో వేబేక్స్ కాన్ఫరెన్స్ సమావేశం. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం గ్రామాలలో నీటి సమస్య లేకుండా అధికారులు కష్టపడి పని చేశారని అదే విదంగా ఈ సంవత్సరం కూడా వేసవిలో గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి సక్రమంగా నీటి సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్న 09 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ల నుండి 818 అవాసాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని మిషన్ భగిరధ అధికారుల నివేదికల ప్రకారం గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కేటగిరీలుగా విభజించి నీటి సరఫరా చేయడం జరుగుతుందని గ్రీన్ కేటగిరీలో రోజుకు ఒక్కో మనిషికి 100 లీటర్లు చొప్పున 692 అవాసాలకు, ఆరెంజ్ కేటగిరీలో రోజుకు 80 లీటర్ల చొప్పున 107 అవాసాలకు, ఎల్లో కేటగిరీలో రోజుకు 21 నుండి 55 లీటర్ల చొప్పున 11 అవాసాలకు, రెడ్ కేటగిరీ కింద 08 అవాసాలు ఉన్నాయని తెలిపారు. ఆరెంజ్, ఎల్లో, రెడ్ కేటగిరీలో ఉన్న అవాసాలను గ్రీన్ కేటగిరీలోకి మార్చేందుకు రూరల్ వాటర్ సప్లయ్, మిషన్ గ్రిడ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరెంజ్, ఎల్లో, రెడ్ కేటగిరీలో ఉన్నా ఆవాసాల జాబితాను అన్నీ మండలాలకు పంపించి నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యుమ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిదులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి సరఫరా సజావుగా జరిగేలా సంబందిత శాఖ అధికారులు మండల, గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. శనివారం వరకు అన్నీ మండలాలలో 2026 – 27 సంబందించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో పాటు ప్రత్యుమ్నాయ చర్యలపై ప్రణాళికలు సిద్దంగా ఉండాలన్నారు. పంపులు, పైప్ లైన్ లీకేజీలు, ఓహెచ్ ఆర్ లలో లీకేజీలను గుర్తించడం జరిగిందని అధికారులు ప్రయారిటీ కింద మోటర్ల రిపేర్లు, హ్యాండ్ పంపుల రిపేర్లు చేయించాలని, గ్రామ పంచాయితీ ట్రాక్టర్లు, ట్యాంకర్లు పని చేయాలని, ఒకవేళ ఎక్కడైనా సరఫరా సమస్య తలెత్తినప్పుడు గ్రామ పంచాయితీ ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా చూసుకోవాలని తెలిపారు. ఎక్కడైతే రిపేర్లకు సంబందించిన ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతధికారుల దృష్టికి తీసుకు వస్తే వెంటనే నిధులను మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీ స్థాయీలో క్లోరినైజేషన్ కోసం బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయితీకి మంచినీటి సహాయకుడిని నియమించి వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని వారు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఎట్టి పరిస్తితిలో ఒక్కరోజు కూడా గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగేది లేదని ఇందుకోసం అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా పరిషత్ సీఈవో శిరీష, డిపిఓ యాదగిరి, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసరావు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



