ఆనందోత్సాహాల మధ్య సోలిపురం సుచిత – బల్వంత్ రెడ్డి దంపతుల 42వ వివాహ మహోత్సవం

ఆనందోత్సాహాల మధ్య సోలిపురం సుచిత – బల్వంత్ రెడ్డి దంపతుల 42వ వివాహ మహోత్సవం

విశ్వంభర, చేవెళ్ల:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడ వార్డు కౌన్సిలర్ సోలిపురం సుచిత – బల్వంత్ రెడ్డి దంపతుల 42వ వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు గుండాల గణేష్ రెడ్డి, గోపిగడ్డ బల్వంత్ రెడ్డి, అమీర్పేట పద్మారెడ్డి, నరాల పూర్ణచందర్ గుప్త తదితరులు హాజరై దంపతులను పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.వారు మాట్లాడుతూ సుచిత – బల్వంత్ రెడ్డి దంపతులు ఇలాగే ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు

Tags: