విద్యార్థి సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ
విశ్వంభర, హైదరాబాదు : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో శాంతియుతంగా బుధవారం నగరంలో చలో అసెంబ్లీ నిర్వహించగా, ప్రభుత్వం అరెస్టులతో అణచివేతకు దిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు విమర్శించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు చేసిన చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించిన పలు సమస్యలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. విద్యా బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించి, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను ఇండ్లు, హాస్టళ్లు, యూనివర్సిటీల వద్ద నుంచే ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. హైదరాబాదులో చలో అసెంబ్లీకి తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని తోపులాటకు దిగారని, అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను ఆఫ్జల్‌గంజ్, బేగంబజార్ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్ సహా పలువురు నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు ఎన్నికల హామీల అమలును కోరితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. బండారు రవికుమార్, డీజీ నరసింహారావు, పి. ఆశయ్య తదితరులు



