మెగా ఆరోగ్య వైద్య శిబిరం విజయవంతం
On
విశ్వంభర, చింతపల్లి: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుభవం కలిగిన ఆరోగ్య వైద్యులచే మెగా హెల్త్ క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్యాంపును గ్రామ సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, ఉప సర్పంచ్ రెహానా బేగం సిద్ధిక్ బాబా ప్రారంభించారు. ఈ క్యాంపులో నల్గొండ జనరల్ హాస్పిటల్ అనుభవం కలిగిన వైద్యులచే ఉన్నత సేవలు మండల ప్రజలు వినియోగించుకున్నారు. క్యాంపులో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, డెంటల్, గైనకాలజిస్ట్, కంటి వైద్యులచే ట్రీట్మెంట్, సలహాలు, రక్త పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన రోగులకు మందులు ఉచితంగా అందజేశారు. మండల ప్రజలు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మండల వైద్యాధికారిని డా. శ్రీదేవి తెలిపారు.



