టూరిజం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాల పెంపు
On
విశ్వంభర, నారాయణగూడ: తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచినందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను టూరిజం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచాలని వినతి పత్రం అంద జేశారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు.వేతనాల పెంపుపై ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి, సబ్బు రాజమౌళి, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, జ్యోతి, రాజశేఖర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.



