ఇందిరమ్మ ఇళ్లతో పేదల కుటుంబాలలో  ఆనందం : కేఎల్ఆర్  

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కుటుంబాలలో  ఆనందం : కేఎల్ఆర్  

విశ్వంభర, మహేశ్వరం :  గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించలేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ  ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం ఎన్డీ తండా గ్రామ సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో   ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కేఎల్ఆర్   కలిసి గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా కె ఎల్ ఆర్   మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్స్, ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ లోనే పేదలకు ఇస్తున్నామని చెప్పారు. సొంత  గ్రామంలో  బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రూ.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. తొలి విడత ఇండ్లు అన్ని  పూర్తి అయినావని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని లక్ష్మారెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలెండర్, బస్సు ప్రయాణం ఇస్తున్నామని తెలిపారు, కొత్త పెన్షన్లు సహా ఇతర హామీలను దశలవారీగా అమలు చేస్తామని కిచ్చెన్నగారు హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు, అందరు కలిసి  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎల్ఆర్  రాకతో గ్రామస్థులు, కాంగ్రెస్ శ్రేణులు, ఇళ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసి, ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంగోత్ అరుణ గోపాల్ నాయక్,ఉప సర్పంచ్ సురేఖ సురేష్, వార్డ్ మెంబర్స్, రాణి భాస్కర్, చందర్, హరిలాల్, ప్రియాంక వెంకటేష్, సామ్లి గోవిందు, సాయిరాం, అంజి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ వివిధ  గ్రామాల మాజీ సర్పంచ్లు వార్డ్ మెంబర్స్, మాజీ  ఎంపిటిసిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: